నవ్యాంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా …
Read More »గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !
యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్, గల్లంతైన విషయంపై సిట్ చేపట్టిన దర్యాప్తు కేబినెట్ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …
Read More »ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియాపై సీఎం జగన్ ఉక్కుపాదం
ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ వింత పరిస్థితికి జగన్ స్టేట్ మెంటే కారణమా.?
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట.. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంతో ఆనందంగా ఉన్నారట.. గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం బాధపడుతున్నారట.. ఎందుకో తెలుసా.? దానికి తాజాగా సీఎం జగన్ ఇచ్చిన స్టేట్ మెంటే కారణం.. రాజకీయంగా పార్టీలు ఎవరైనా మారొచ్చు.. అయితే రాజ్యాంగబద్ధంగా మారాలి. ఇదే విషయం జగన్ చెప్తూ ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తే కచ్చితంగా రాజీనామా చేసి రావాలని …
Read More »చంద్రబాబు ఈరోజు సభలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి సీఎం డిమాండ్
స్పీకర్‌ను గౌరవంగా తనసీట్లో కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని, ఆయన తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ ధన్యవాద సభలో జగన్ మాట్లాడుతూ స్పీకర్‌గా తమ్మినేనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నతర్వాత అన్నిపార్టీల నేతలు వచ్చి స్పీకర్‌ను తన సీట్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు కోరారు. తరువాత సాదరంగా నేనులేచి, మిమ్మల్ని ఆలింగనం చేసుకొని, మీ …
Read More »జైలుకు వెళ్ళే బ్యాచ్ లో ముందు వరుసలో ఉన్న మాజీ మంత్రి ఇతనే..?
చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన అవినీతి డొంక కదిలేలా కనిపిస్తోంది. పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.. కానీ ఆయనకు పదవి వచ్చినప్పటినుంచీ అవినీతి కార్యక్రమాలకే పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో నీరు- చెట్టు పథకంలో మంత్రితోపాటు ఆయన అనుచరులు వందలకోట్లు తినేసారు. అలాగే అధికారం అండతో పత్తి కొనుగోలులో గోల్‌మాల్ చేసి …
Read More »బుద్ధా వెంకన్న సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రధాన అనుచరుల అరెస్ట్ కు రంగం సిద్ధమైందా.?
టీడీపీ విప్ బుద్ధా వెంకన్న.. అధికార తెలుగుదేశం అధిష్టానం అండ చూసుకుని యధేచ్చగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తి.. దౌర్జన్యాలు, వడ్డీ వ్యాపారాలతో విజయవాడ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కాల్ మనీ పేరుతో మహిళల మానాలతోనూ వ్యాపారం చేసిన ఘనుడు ఈయన.. గతంలో ఈయన అనుచరుడిని కాల్ మనీ, సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసారు. ఈ కేసులో రెండో నిందితుడు భవానీ శంకర్‌ను మాచవరం పోలీసులు …
Read More »40ఏళ్ల రాజకీయ అనుభవశాలి తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు
ఏపీ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. అయితే ఈ కార్యక్రమంపై చంద్రబాబు తక్కసు వెళ్లగక్కుతూ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రులతో సహా 30మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు..మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తో పాటు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటరాగా తమ్మినేని శాసనసభ కార్యదర్శి …
Read More »జగన్ సీఎం కాలేడు ఇది శాసనం అన్నాడు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయాడు.. అదీ జగన్ అంటే
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలోనూ ఘోరపరాజయం పాలయ్యాడు పవన్. అయితే సార్వత్రిక …
Read More »జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్తారా..?
నిన్నజరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు.విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …
Read More »