ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.
Read More »ఎంపీ RRRకి బెయిల్
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »AP 2021-22 వార్షిక బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, …
Read More »ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యూడీషియల్ అధికారిని నియమించాలని సూచించింది. వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేసి నివేదికలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని పేర్కొంది. రఘురామ బెయిల్ పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read More »Mp రఘురామ కాళ్లు ఎందుకు రంగు మారాయంటే..?
తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామ రాజు దిగువ కోర్ట్‌లో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా మరియు తెలుగుదేశం జనసేన సంబంధించిన సామాజిక మధ్యమలో దానిని చిలువలు, వలువలు చేసి..ఆ అరికాళ్ల ఫొటోలను పతాక శీర్షికలో ప్రచురించింది. అదే ఫొటోలనే తెలుగు దేశం పార్టీ వైరల్ చేసింది. అయితే..ఇదంతా కట్టు కథేనని…ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్ట్ నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చడంతో ఎల్లో …
Read More »సీఎం జగన్ కు లోకేష్ సలహా
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »సీఎం జగన్ అసంతృప్తి
కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు. టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల …
Read More »రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.
Read More »