ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.
Read More »సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు
తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు. తాను,తన తనయుడు అక్కినేని నాగచైతన్య,సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ,యువహీరోయిన్ కృతిశెట్టిలు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజు సక్సెస్ మీట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎంతో జరిగిన …
Read More »ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపుపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
బంగార్రాజు ప్రమోషన్ మీట్లో సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తొలిసారి స్పందించాడు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తమ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించాడు. రేట్లు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. తమ సినిమా వసూళ్లు కొంచెం తగ్గినా పరవాలేదన్నాడు. రేట్లు పెంచలేదని ‘బంగార్రాజు’ను జేబులో పెట్టుకుని కూర్చోలేం కదా అని తెలిపాడు. …
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది
Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.
Read More »వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Read More »Ap నిరుద్యోగ యువతకు శుభవార్త
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7390 కాగా, కొత్తగా సృష్టించినవి 3475 ఉన్నాయి. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 4142 పోస్టులు, APVVP పరిధిలో 2520 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 4203 పోస్టులు ఉండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయనున్నారు.
Read More »బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో YSRCP ఘనవిజయం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలు చోట్ల టీడీపీకి.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. అయితే.. మంత్రుల స్వగ్రామంలో.. నివాసముండే ప్రాంతాల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిందంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు సొంత ఇలాఖాలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో …
Read More »బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం
ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,550 …
Read More »