నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీఈఈటీ) ద్వారా ఇకపై యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని యువతకు మరింత వేగవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగులకు లోన్లు, మార్ట్‌గేజ్ వేగంగా జరిపే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఎక్విఫాక్స్ సంస్థతో డీఈఈటీ శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. దీంతో ఇకపై డీఈఈటీలో నమోదు చేసుకున్న అభ్యర్థుల వెరిఫికేషన్ వేగంగా, పారదర్శకంగా పూర్తవనున్నది. …
Read More »1000కోట్లతో ఫియట్ భారీ పెట్టుబడి
హైదరాబాద్ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్ తన రెండో మజిలీగా హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్ అమెరికన్ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్ గ్లోబల్ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్నమంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం మొదలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. …
Read More »తెలంగాణలో అమెజాను భారీ పెట్టుబడి
ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో రూ. 20 వేల 761కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2022 నాటికి హైదరబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ప్రారంభించనుందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పలు చర్చల తర్వాత ఏవీఎస్ పెట్టుబడులకు ముందుకు వచ్చిందనీ, మల్టిపుల్ డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ …
Read More »వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు …
Read More »మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రక్షాబంధన్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు పార్టీ మహిళఆ నేతలు రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు కవిత మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి రాఖీ కట్టారు.
Read More »ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు
రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కె. తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, ఎండోమెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు …
Read More »ఈచ్ వన్ …ఫ్లాంట్ వన్
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం మొదలయింది.సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అల్లనేరెడ్ మొక్కను నాటి ప్రారంభించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి అని సూచించారు.అంతే కాకుండా ఈచ్ వన్..ఫ్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకు సాగాలి. మొక్కలను నాటడమే కాకుండా …
Read More »తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పైపైకి
తెలంగాణ పారిశ్రామిక రంగం 2019-20లో ఘనమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. జాతీయ జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి) సగటుతో పోల్చుకుంటే రాష్ట్రం 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2018-19లో 4.55 శాతం నమోదు కాగా 2019-20లో అది 4.76 శాతానికి పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,34,432 కాగా …
Read More »ఫుడ్‌ప్రాసెసింగ్‌కు ప్రత్యేక జోన్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్‌ప్రాసెసింగ్‌రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రత్యేకంగా ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జలవిప్లవం ద్వారా వ్యవసాయంరంగంతోపాటు పా లు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వీటిద్వారా ప్రాసెసింగ్, అగ్రికల్చర్‌రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం …
Read More »