కృష్ణా జలాల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ …
Read More »మాజీ మంత్రి ఈటలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్‌ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ …
Read More »ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తాం – మంత్రి కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని తేల్చిచెప్పారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు.. చట్టప్రకారం రావాల్సిన నీటివాటాను సాధించుకుంటాం అని పునరుద్ఘాటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని …
Read More »నారాయణపేటలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్.. 10 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలో …
Read More »చిల్డ్రన్స్, సైన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నారాయణపేట జిల్లాలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, …
Read More »నారాయణపేటలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌కు, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read More »మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు భేటీ
ప్రగతి భవన్‌లో రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ వస్ర్త వ్యాపార సంస్థ కైటెక్స్.. రాష్ర్టంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా జౌళి రంగంలో పెట్టుబడుల యోచనపై మంత్రితో ఆ బృందం చర్చించింది. పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవకాశాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ …
Read More »తెలంగాణలో మున్సిపల్ – పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ మున్సిపల్ పరిపాలన – పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి.. 2020-21 సంవత్సరానికి వార్షిక నివేదికను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read More »బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరు : మంత్రి కేటీఆర్
తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇవాళ ప్రారంభించుకున్న బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘన నివాళులర్పించారు. బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బాలానగర్ వాసుల …
Read More »బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) లో భాగంగా హైదరాబాద్, బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ మాధవరం కృష్ణారావు, శ్రీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ నవీన్ రావు, నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ …
Read More »