ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. …
Read More »GHMC లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు …
Read More »ఈ నెల 20న వరంగల్, హనుమకొండ ల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి …
Read More »కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి భూమి పూజ…..
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఐటీ రంగంలో తెలంగాణ జోరు
ఐటీ రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతోంది. 2021-22లో హైదరాబాద్ నుంచి రూ.1.67 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.1.45 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొన్నేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2026 నాటికి రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించి, 10 లక్షల మందికి IT రంగంలో ఉద్యోగాలు …
Read More »తెలంగాణ రైతాంగానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రికేసీఆర్ గారి చొరవతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కండ్లు మండి సరికొత్త కుట్రలకు తెరలేపింది. రైతులపై కక్ష కట్టిన …
Read More »బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు …
Read More »యువత కోసం వై-హబ్ – మంత్రి కేటీఆర్
యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ వై-హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. యువ ఆవిష్కర్తలను గుర్తించి.. వారిని ఔత్సాహక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సోమవారం తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రి పరిశీలించి, వాటి …
Read More »అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్ పై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అక్కడే ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం …
Read More »అంబేద్కర్, జగ్జివన్‌రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు- మంత్రి హరీష్‌రావు
జగ్జివన్‌రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం జగ్జివన్‌రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్‌ను కొనియాడారన్నారు. ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా.. చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. …
Read More »