ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఉత్పత్తి రంగం బలోపేతానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. కేంద్రం మంచి పని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ వ్యూహాలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ …
Read More »లండన్‌లో ఆటో మొబైల్ ఇండస్ట్రీ లీడర్స్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు …
Read More »ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి-మంత్రి హరీశ్‌రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే …
Read More »చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఒక మహిళా రైతు వద్ద నుంచి ఆమె తెచ్చుకున్న టిఫిన్ …
Read More »భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే Kp కు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రైసింగ్ స్టార్ హైస్కూల్ వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్ ఇక్కడే ఉంటారు’’ అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్… తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.కర్నాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా …
Read More »కైటెక్స్ అపెరల్ పార్కుకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ …
Read More »