తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ దేశ రాజధాని డిల్లీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు.భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. Good meeting the ever dynamic Textiles Minister @smritiirani Ji. Discussed pending issues in power loom upgradation/modernisation and also requested for sanction of …
Read More »బేగంపేట బస్తీ ధవాఖనాను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న బస్తీ ధవాఖనా పనితీరును పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ ధవాఖనాను మంత్రి శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్తీ ధవాఖనాలో ఉన్న వసతులను అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. బస్తీ ధవాఖనాలో ఉన్న డాక్టర్ తోపాటు, ఆమె సహాయక సిబ్బందిని, రోజు …
Read More »కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్..మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మరోతీపికబురు దక్కింది. కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటిఆర్, రవాణామంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి లను కలసి, BRTS సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించవలసిందిగా కోరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు BRTS ఏర్పాటు చేయాల్సిందిగా కేపి వివేకానంద కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన …
Read More »హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్రం ఓకే
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో గుర్తింపును సంతరించుకోనుంది. హైదరాబాదులో డిఫెన్స్ ఇంకు బెటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రక్షణ ఎకో సిస్టమ్‌నుదృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంకుబేటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో రక్షణశాఖకు మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ …
Read More »మంత్రి హరీశ్‌రావు కోరికకు వెంటనే ఓకే చేసిన మంత్రి కేటీఆర్
చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హరీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖమంత్రి వెంటనే ఓకే చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న మమకారాన్ని మరోమారు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్టైల్ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »చెరుకు రైతులకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తీపికబురు
చెరుకు రైతులకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తీపికబురు తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జెహీరాబాద్ జిల్లా పరిధిలోని చెరకు రైతు సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సమీక్ష నిర్వహించారు. రైతులకు చెరుకు కర్మాగారాల యజమానులు చెల్లించాల్సిన బకాయిలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో అధికారులతో పాటు, చెరకు కర్మాగారాల యజమానులు పాల్గొన్నారు. చెరకు రెతులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఇరువురు మంత్రులు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలను …
Read More »నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త
నల్లగొండ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు.జిల్లాలోని నకిరేకల్‌లో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో నకిరేకల్ పట్టణానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. …
Read More »ఐటీ పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
ఐటీ పరిశ్రమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. నగరంలో నలు దిశాల ఐటీ విస్తరణ, భవిష్యత్తు వ్యూహంపైన ఈ రోజు విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. నగరంలో ఐటీ పరిశ్రమను నలుదిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ప్రస్తుతం …
Read More »కువిమర్శలు కాదు..దమ్ముంటే కేటీఆర్ సవాలుకు స్పందించండి
కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42ఏండ్లు పరిపాలించి పేదవర్గాలను అణచివేసిన పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేక నిత్యం గాంధీభవన్‌లో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా …
Read More »శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..కేటీఆర్
అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్‌పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన …
Read More »