తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్‌లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్‌సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. …
Read More »హైదరాబాద్ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ స్పెషల్ రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా …
Read More »ఫార్మా బ్రాండ్ హైదరాబాద్
ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో గ్రాన్యూల్స్ ఇండి యా, లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం తాము హైదరాబాద్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో …
Read More »అండగా ఉంటాం.. ఆధైర్యపడకండి-మంత్రి కేటీఆర్
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా హబ్సీగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »ఈవోడీబీలో మరిన్ని సంస్కరణలు-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టిన రాష్ట్రప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఈవోడీబీలో తాము చేపట్టనున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈవోడీబీ -2020 సంస్కరణలపై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా …
Read More »ఐదేళ్లలో 14లక్షల ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఐదేళ్ల రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.మొత్తం 12వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటితో 14లక్షల మందికి ఉపాధి లభించిందని వ్యాఖ్యానించారు.లైఫ్ సెన్సైస్,ఫార్మా రంగాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అడ్డగా మారింది.లెదర్ పార్కుల ద్వారా ఆదాయం రెట్టింపైంది.చేనేతకు చేయూతనివ్వడంతో అంతరించిపోయిన డిజైన్లకు …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు..
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు. …
Read More »ఏపీలో 50 వేల ఉద్యోగాలు
వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్‌లను, …
Read More »ఐటీ హాబ్ దిశగా వరంగల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో .. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఐటీ హాబ్ దిశగా అభివృద్ధి చెందుతుంది అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ ను ఐటీ హాబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ.. తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి …
Read More »దావోస్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గోనున్నారు. నిన్న సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రారంభమైన యాబై వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ఈ నెల …
Read More »