తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
Read More »అనిల్ అంబానీకి ఐటీ షాక్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …
Read More »ఆప్ నేతలపై ఈడీ దాడులు
ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …
Read More »అవినీతి మా ఇంట వంట లేదు-లోకేష్ నాయుడు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఐటీ దాడులపై స్పందిస్తూ” రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఆయన లోకంలో పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా …
Read More »ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావుపై ఐటీ దాడులు..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావుపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్టూడియో ఎన్ ఛానల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎన్నికలకు ముందు నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే నార్నె శ్రీనివాసరావుపై కూడా దాడులు జరగడం గమనార్హం.
Read More »