వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More »గోదావరి జలాలు.. విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …
Read More »