అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. 2006లో డేనియల్స్ తో ఎఫైర్ నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటపెట్టకుండా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అరెస్టు దాకా తీసుకొచ్చింది. ఈ ఆరోపణలు నిజమని న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ తేల్చింది. తాజా పరిణామాలను ట్రంప్ ఖండించారు. తనను కావాలనే వెంటాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ …
Read More »డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.
Read More »మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా …
Read More »మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ నిరాహార దీక్ష
శ్రీలంక దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ పరిష్కారం చూపాలంటూ ఆ దేశ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ 24 గంటలపాటు నిరాహార దీక్ష చేశాడు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ప్రకటించి నిరసనల్లో పాల్గొన్నాడు. అలాగే 2019లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 269 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
Read More »