పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.
Read More »ఓవైసీకి జడ్ కేటగిరి భద్రత
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. …
Read More »