సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా దబీర్‌పేట స్మశానంలో రాకేష్ మృతదేహానికి ఆయన తండ్రి కుమారస్వామి నిప్పంటించారు. అంతకుముందు నర్సంపేట చేరుకున్న రాకేష్ మృతదేహానికి పెద్ద ఎత్తున ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆ తర్వాత అతడి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, …
Read More »నదిలో పడిపోయినా ఆర్మీ బస్సు.. 7 గురు జవాన్లు మృతి
లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ఓ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పార్థాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళ్తుండగా టుర్టుక్ సెక్టార్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మీ సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు. 19 మంది ఆర్మీ జవాన్లు గాయపడినట్లు గుర్తించారు. వీరిలో …
Read More »ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్..
ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్టులో నరవణే ఉన్నారు. ఏప్రిల్ 30న ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త చీఫ్‌ను కేంద్రం నియమించింది. నరవణే తర్వాత సీనియర్‌గా ఉండటంతో మనోజ్ పాండేను నియమించింది. మరోవైపు బిపిన్ రావత్ అకాల మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) …
Read More »కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రకటించారు.‘ఆపరేషన్ నమస్తే’ పేరుతో కొవిడ్-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములం అవుతామని వారు వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని, ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం …
Read More »వాట్సాప్‌లో ఆ సమాచారం పంపొద్దు ..చాలా జాగ్రత్త
ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్‌లో సమాచారం షేర్ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్‌లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు …
Read More »పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు..!
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర …
Read More »ఇంటర్ తో ఉద్యోగాలు
మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా.. మీకు చదువుకునే స్థోమత లేదా.. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. వచ్చే ఏడాది జూలై నెలలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.5-19.5 సంవత్సరాల మధ్య ఉన్న వారు దీనికి ఆర్హులు. నవంబర్ 13వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు …
Read More »పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం భారత దళాలు సిద్ధం.. ఆనందంలో దేశ ప్రజలు.. కేంద్రం కూడా ఇదే విధంగా
భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్ తేల్చిచెప్పారు. ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత …
Read More »బ్రేకింగ్..భారత్‌లో చొరబడిన 40 మంది ఉగ్రవాదులు…?
కశ్మీరీ ప్రజలకు కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీరీ అంశంపై 70 ఏళ్లుగా చలికాచుకుంటున్న పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో యాగీ చేసినా..ఆఖరికి ఐక్యరాజ్యసమితికి వెళ్లినా..కశ్మీరీ అంశం భారత అంతర్గత సమస్య,..అందులో జోక్యం చేసుకోమని ప్రపంచదేశాలు …
Read More »పాక్ వక్రబుద్ధి
దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ క్రమంలో తన భూభాగం పరిధిలోని సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎత్తివేసింది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలాను నీళ్లు పూర్తిగా చుట్టిముట్టాయి. దీంతో సైన్యం ,అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు …
Read More »