తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం …
Read More »వినాయకుడి ప్రతిమలను ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలి..ఏ సమయంలో పూజించాలి…?
హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు …
Read More »