ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్ అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్/యూటీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో పాల్గొన్న …
Read More »తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిన్న సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. 1992బ్యాచ్ తెలంగాణ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదు. అదనపు బాధ్యతలో సైతం ఉండరాదు అని ఎన్నికల …
Read More »మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.
Read More »తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఖరారు
ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి …
Read More »జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం – ఎంఎం నాయక్ విజయనగరం – వివేక్ యాదవ్ విశాఖ – కాటంనేని భాస్కర్ తూర్పు గోదావరి – …
Read More »వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
తెలంగాణలోవెయిటింగ్‌లో ఉన్న 4 గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్‌గా ఎం. ఆర్. ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్ రాస్‌కు గనులు భూగర్భ …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్ అయ్యారు.
Read More »సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పని చేస్తున్న సత్య నాదేళ్ల ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. సత్య నాదేళ్ల తండ్రి,మాజీ ఐఏఎస్ అధికారి అయిన యుగంధర్ కన్నుమూశారు. అప్పట్లో తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు హాయాంలో యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుంగధర్ పనిచేశారు. దేశంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పలు అత్యంత కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా తనదైన ముద్రవేశారు. ఎల్బీ శాస్త్రి …
Read More »జాతీయ వార్తలు..
ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …
Read More »సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతివ్వాలి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడా.. సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలా.. అవును ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడంటున్నారు కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి,ఐఏఎస్ అధికారి బిపిన్ చంద్ర. ఆయన మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడని “ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది నీటికోసమే. దానికి సమాధానానికి పునాది కాళేశ్వరం ప్రాజెక్టే …
Read More »