తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు రాజధాని నగరం హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక & వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ రోజు శనివారం ఉదయం నగరంలోని గచ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సేవలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో …
Read More »భారీ వర్షాలు.. అలెర్ట్‌గా ఉండండి: కేసీఆర్ ఆదేశం
మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది …
Read More »హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండు రోజులూ ఇంతే!
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఇటు పటాన్ చెరు నుంచి అటు అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వర్షం కురుస్తూనే ఉంది. అమీర్‌పేట్, నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో …
Read More »హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా అధికమైంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనరస్థలిపురం, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, …
Read More »మంకీపాక్స్.. ఎలాంటి ఆందోళన వద్దు: హరీష్‌రావు
మంకీపాక్స్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో మంకీపాక్స్ రెండో కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. ఫీవర్ ఆస్పత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లుహరీష్‌రావు చెప్పారు.
Read More »మరో ఐదు గంటల్లో.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువుల్లోకి వరదనీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రానున్న ఐదు గంటల్లో ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ …
Read More »హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్‌కు ఎన్.శంకర్, ఆసిఫ్‌నగర్‌కు శ్రీనివాస్, రాంగోపాల్‌పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు …
Read More »అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సెక్రటేరియట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.
Read More »ప్రజలు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు కురుస్తున్నందున మహారాష్ట్రతో పాటు తెలంగాణకు రెడ్‌అలర్ట్ ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్‌ను అలర్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల …
Read More »హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు
ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, కానిస్టేబుల్ సందీప్, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More »