తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ …
Read More »ఘోరం.. ఉప్పల్‌లో తండ్రీకొడుకుల దారుణ హత్య!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ బ్యాక్‌సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి. హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని …
Read More »స్పైస్‌జెట్‌లో పొగలు.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మార్గమధ్యంలో విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో మొత్తం 86 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.
Read More »ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత!
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »ఎలర్ట్: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు!
రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, …
Read More »ఇద్దరూ మైనర్లు.. వరసకు అన్నాచెల్లెళ్లు.. బాలిక ప్రెగ్నెంట్!
బిహార్‌కు చెందిన ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే.. ఓకే పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే పైగా వరసకు అన్నాచెల్లెళ్లు. అందుకే వారు కలిసి తిరుగుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రెగ్నెంట్. ఇంట్లో, ఊళ్లో తెలిస్తే గొడవ జరుగుతుందని భయపడిన వారు బిహార్ నుంచి పారిపోవాలని భావించారు. ఈ క్రమంలో 22న సికింద్రాబాద్ …
Read More »మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్!
మేడ్చల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …
Read More »జీడిమెట్లలో బైకులను కాల్చేసిన సైకో!
హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో మొత్తం 9 బైకులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో దాదుపు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Read More »హైటెక్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లోని హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ లో మామిడి దీప్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ అడబిడ్డలు ఎంతో ఇష్టంగా.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు పాటు సాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలోని మెటల్ చార్మీనార్ దగ్గర హైటెక్ లో మన బతుకమ్మ సంబరాలు పేరుతో దీప్తి మామిడి గారు ఘన …
Read More »హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్‌జామ్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా రోడ్లపైకి వరదనీరు రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ మొదలైన చోట్ల వర్షం పడింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు …
Read More »