హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్‌బాయ్, ఆటోడ్రైవర్ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …
Read More »కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి
కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్ మనోజ్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్ క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …
Read More »పాముల పార్కు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన …
Read More »వయస్సు 70.. నలుగురు భార్యలు.. యువతిపై దారుణం!
ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి.! ఓ అమ్మాయికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించి.. ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. అసలేం జరిగింది..? ఎవరీ వృద్ధ కామాంధుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసలేం జరిగింది!? బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో …
Read More »హైదరాబాద్ లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …
Read More »ఆ గీత దాటితే.. పట్టివేతే
కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే… వెంటనే పోలీసులకు సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర …
Read More »హైదరాబాద్‌లోకరోనా కిట్స్
హైదరాబాద్‌కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ అరుదైన ఘనత సాధించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి ఆ సంస్థ అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్‌కు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం. అమెరికా నేషనల్ …
Read More »బీ అలెర్ట్.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. !
రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్తె. తెలంగాణ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి చనిపోయాడని, …
Read More »బ్రేకింగ్…హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో 5 గురికి కరోనా పాజిటివ్..!
తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ ఎన్ని ముందు జాగ్రత్త లు తీసుకున్నా ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రం లో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాలనుండి వచ్చిన వారు క్వారంటైన్ కు వెళ్లకుండా తమ ఇండ్ల కు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు కూడా …
Read More »లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై నిఘా కన్ను
కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ …
Read More »