తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. పోలీస్ విభాగంలో మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా… 39 మంది కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా …
Read More »ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఎంతో తెలుసా..?
బొజ్జ గణపతులందు ఖైరతాబాద్ గణపతి వేరు! ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ తొండమునేకదంతంతో.. కొండంత రూపంతో భక్తులను కాచేభవహరుడు ఆ స్వామి!! 2019లో అక్కడ 65 అడుగుల ఎత్తైన గణేశుడి ప్రతిమను రూపొందించిన నిర్వాహకులు.. ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తుతో ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ స్వామికి అటూ ఇటూ లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »60వేలకు దగ్గరలో బంగారం
అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరిగి రూ.49,780కి చేరింది. అటు కిలో వెండి ధర ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700కి చేరింది.
Read More »27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతి
వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్ గణపతి గుర్తుకు వస్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్టించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …
Read More »పీవీ రచనల ముద్రణ, స్మారకం కేంద్రం ఏర్పాటు : సీఎం కేసీఆర్
వీపీ నరసింహారావు రచించిన రచనలను వంద శాతం సాహిత్య అకాడమీ ద్వారా ముద్రిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పీవీ రచనలను విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్లు వెల్లడించారు. పీవీ రచనలను పలు భాషల్లో ముద్రిస్తామని సీఎం చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఐదు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వంగర, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, …
Read More »ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు
రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కె. తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, ఎండోమెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు …
Read More »కొవిఫర్ ఔషధం ధర ఎంతో తెలుసా…?
కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్’ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటివిడుతగా 20వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, …
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …
Read More »