హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్(వేస్ట్ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఘన …
Read More »హైదరాబాద్‌లో 137 లింక్ రోడ్లు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ రెండు లింక్ రోడ్లను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. మొదటిదశలో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 లక్షలు మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మరో 100 లింక్ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. …
Read More »హైదరాబాద్ పేరును మారుస్తాం -ఎంపీ అర్వింద్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. కేంద్రం నిధుల విషయంలో మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారు. రూ.224 కోట్లు ఇస్తే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే మంత్రి కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరు. GHMC ఎన్నికల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నసీఎం కేసీఆర్ పనిలో సోమరిపోతని విమర్శించారు.
Read More »హైదరాబాద్ కి కష్టం వస్తే సహాయం అందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా-మంత్రి కేటీఆర్
• ఇప్పటికే ఈ సంవత్సరం లో 1,200 మిల్లీమీటర్ల వర్షం హైదరాబాద్ లో పడింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పడింది • గతంలో వర్షం సంవత్సర కాలం మొత్తం కురిస్తే ప్రస్తుతం వాతావరణ మార్పుల వలన ఒకేసారి కుంభవృష్టిగా వర్షాలు హైదరాబాద్ లో పడ్డాయి • మొన్న జరిగిన వర్షాలకి వందలాది కాలనీలు వరదలో మునిగినాయి • తెలంగాణలో భారీ వర్షాలు పడినప్పుడు ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో ప్రజలంతా …
Read More »క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నాం : మంత్రి కేటీఆర్
క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరద సాయం అందరికీ ఇచ్చామని ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం చేస్తామన్నారు. వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ నేడు తెలంగాణ భవన్‌లో మీడియా ద్వారా మాట్లాడారు. 1908లో మూసీకి వరదలు పోటెత్తాయని చరిత్ర చెబుతోంది. 1916 తర్వాత ఈ ఏడాది …
Read More »కరోనా సమయంలో రూ. 52,750 కోట్ల ఆదాయ నష్టం
కరోనా, లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారు. రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక …
Read More »పెట్టుబడుల అడ్డా తెలంగాణ గడ్డ
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడంతో రాష్ట్రంలోని పారిశ్రామికవర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి వచ్చిన చరిత్ర లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఓ విదేశీ కంపెనీ తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావడంపై పరిశ్రమవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాకతో తెలంగాణ ఇకపై డాటా సెంటర్ హబ్‌గా మారుతుందని …
Read More »జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ఉదయం ప్రారంభించారు. భవన నిర్మాణ వ్యర్థాలకు చెక్ పెట్టేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 500 టీపీడీ సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్లతో కన్‌స్ర్టక్షన్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇసుక, కంకరను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ …
Read More »తెలంగాణలో అమెజాను భారీ పెట్టుబడి
ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో రూ. 20 వేల 761కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2022 నాటికి హైదరబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ప్రారంభించనుందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పలు చర్చల తర్వాత ఏవీఎస్ పెట్టుబడులకు ముందుకు వచ్చిందనీ, మల్టిపుల్ డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ …
Read More »మోహిదీపట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్‌ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »