ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్‌మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. …
Read More »24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్ లోని మియాపూర్ డివిజన్ లో జయప్రకాష్ నగర్ కాలనీ నందు 108 డివిజన్ టీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గారి గెలుపును ఆకాంక్షింస్తూ అన్వర్ షరీఫ్ గారి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రం …
Read More »వారికి ఓటుతో బుద్ధి చెప్పండి : మంత్రి కేటీఆర్
అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, మూసాపేట్ డివిజన్ల టీఆర్‌ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో …
Read More »మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్
హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక. ఏడేండ్లుగా ఇక్కడ ఒక్క మతఘర్షణ లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో కొందరు చేతకాని నాయకుల వల్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలో మననగరం ప్రశాంత జీవనానికి నిలయం. ఉపాధి, పరిశ్రమల రంగానికి పెట్టింది పేరు. ఇటీవల అమెజాన్ సంస్థ 21 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడిని మన నగరంలో పెట్టింది. రాష్ట్రం వచ్చాక రెండు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ను మనం …
Read More »గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గోదావరి, అంజిరెడ్డి రెడీ అవుతున్నారు. అంజిరెడ్డి దంపతులకు నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. దీంతో ఇవాళ సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అంజిరెడ్డి ఇంటికి వెళుతున్నారు.
Read More »తెలంగాణలో మరో వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న మహీంద్రా సంస్థ
తెలంగాణకి మరో పెట్టుబడి రానున్నది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో తన అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద …
Read More »హైదరాబాద్ మరింత సురక్షితంగా, భద్రంగా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ …
Read More »నేడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. ఈ సందర్భంగా ఆయన నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం …
Read More »సిద్ధాంతం లేని రాద్ధాంతపు పార్టీ బీజేపీ
బీజేపీకి ఒకప్పుడు సిద్దాంతం ఉండేది. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారింది. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. వారి వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి. కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు వేయాలి. 70 ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెరుకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదు. …
Read More »జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 24 బస్తీ దవాఖానాలు
హైదరాబాద్‌లోని పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే 199 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ రోజు గురువారం నుండి మరో 24 అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఉపసభాపతి పద్మారావుతోపాటు.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగా కాచిగూడ, పార్శీగుట్ట, కుత్బుల్లాపూర్, గూలిపూర, మలక్‌పేట్, కవాడిగూడ పరిధిలో ప్రారంభంకానున్నాయి. దూల్‌పేట్, ఎర్రగడ్డ, …
Read More »