మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా హెగ్డే ప్రస్తుతం తన హవా కొనసాగిస్తుంది. వరుస బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. గత ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో అలరించిన పూజా ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హిందీలోను పూజా నటిస్తుండగా సల్మాన్ సరసన కభీ …
Read More »గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …
Read More »డబ్బు ఆశచూపి బాలికపై
డబ్బుల ఆశచూపి ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం …ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు 10 ఏండ్ల క్రితం నగరానికి వలసవచ్చి, నగరశివారు సూరారం సిద్ధ్దార్థనగర్‌లో స్థిరపడ్డారు. రోజూ వారి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు. తల్లిదండ్రులు ఇద్దరు రోజూ కూలీపనులకు వెళుతుండగా.. …
Read More »హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.
Read More »మద్యం మత్తులో నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం
మద్యం మత్తులో బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి దిగాడు. రాత్రి 9 గంటలకు మహిళల ఇంటికెళ్లి మరీ వేధించాడు. అసభ్య పదజాలంతో మహిళలను సమీర్ దూషించాడు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడని బాధితులు చెబుతున్నారు. సమీర్‌తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు …
Read More »అబ్బాయిలు ఈ వార్త మీకోసమే..?
సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిలను ఎరవేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైబరాబాద్ CP సజ్జనార్ హెచ్చరించారు. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్ చేయిస్తూ అబ్బాయిలను ముగ్గులోకి దించుతున్నారని చెప్పారు. రెచ్చగొట్టి బట్టలు విప్పించి, ఆ వీడియోను రికార్డు చేస్తారని తెలిపారు. ఆ వీడియోను బాధితులకు పంపించి.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు
Read More »తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి ఆర్టీసీ బస్ పాస్లు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ పాస్లు జారీ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించి బస్పాస్ కోడ్ పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్ధులకే బస్ పాస్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బస్పాస్లను పొందే విద్యార్ధులు తమ విద్యా సంస్థ బస్పోస్ కోడ్ తో సహా నిర్దేశిత పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..
Read More »తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమం
తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతోపాటు.. వాటి విక్రయం ద్వారా మహిళలూ ఉపాధి పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం చేపలతోపాటు, చేపల వంటకాలనూ విక్రయించేలా తయారుచేసిన సంచార విక్రయ వాహనాలను (మొబైల్ ఫిష్ ఔట్‌లెట్స్) అందుబాటులోకి తెచ్చింది. గ్రూపులుగా ముందుకొచ్చే మహిళలకు వీటిని అందజేయాలని నిర్ణయించింది. దీనిద్వారా నిరుద్యోగ మహిళలకు ఉపాధి అందనుండగా.. వినియోగదారుడికి తన …
Read More »సిరాజ్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా..?
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు. తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read More »హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
గ్రేటర్ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో రూ.4.6 కోట్లతో నిర్మించనున్న వైకుంఠదామం పనులను ప్రారంభిస్తారు. అనంతరం కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.18 కోట్లకుపైగా నిధులతో చేపట్టిన అధివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం 10.10 గంటలకు ఫతేనగర్‌లో రూ. 270.50 లక్షలతో నిర్మిస్తున్న నాలా …
Read More »