తానేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ కోసమేనని.. ఆ పార్టీ లైన్‌లోఏ ఉంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. పార్టీనుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదని.. ఇప్పుడు లొంగుతానా? …
Read More »భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్ అంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగంటలకు బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రాజభవన్, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గౌడ్స్ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం …
Read More »ముందస్తుకు బీజేపీ సై అంటే.. మేమూ సై!: తలసాని
తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్‌ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వచ్చారని.. …
Read More »కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా
దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే …
Read More »కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్
విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలు ఎవరినైనా నొప్పిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని తాను కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read More »కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మ: బాల్క సుమన్
విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌నిలదీశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు కిషన్‌రెడ్డి ఒక్క మంచి పనైనా చేయించారా? అని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మగా ఆయన మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో ఉన్న గుమస్తాలు కూడా గుర్తు పట్టరన్నారు. ‘‘కిషన్‌రెడ్డి తెలంగాణ ద్రోహి. …
Read More »జీహెచ్‌ఎంసీలో బీజేపీకి బిగ్ షాక్..
హైదరాబాద్‌లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్‌మెట్ …
Read More »టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …
Read More »తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
Read More »సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష
అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …
Read More »