ఆదివారం నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో పదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. చివరి వికెట్ కు శిఖర్ ధావన్, మోహిత్ రాథీ కలిసి 55* రన్స్ రాబట్టారు. ఇప్పటివరకు పదో వికెట్ రికార్డ్ భాగస్వామ్యం 31* రన్స్ కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్ ఆటగాళ్లు టామ్ కరన్, అంకిత్ రాజ్పుత్ దీన్ని నెలకొల్పారు. కాగా …
Read More »కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శిఖర్ దావన్
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో మాచ్ లో అద్భుతంగా ఆడి 99* రన్స్ చేసిన పంజాబ్ ప్లేయర్ ..టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఐపీఎల్ లో టీమిండియా మాజీ కెప్టెన్.. ఆర్సీపీ కెప్టెన్ రన్ గన్ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశారు. కోహ్లి ఇప్పటివరకు 217 ఇన్నింగ్సుల్లో 50 సార్లు 50+ స్కోర్ చేయగా, ధావన్ 208 ఇన్నింగ్సుల్లోనే 51 …
Read More »RCB పై SRH ఘన విజయం
నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ …
Read More »ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్
పూణే వేదికగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …
Read More »ధోనీ Six కి కూతురు జీవా Shock
ఐపీఎల్ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …
Read More »ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు
ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.
Read More »ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్-రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. …
Read More »సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) లోకల్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. కేవలం పేరులో మాత్రమే హైదరాబాద్ ఉంది కానీ తెలుగు ఆటగాళ్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ప్రతి టీం తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లను తీసుకుంటే హైదరాబాద్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల వేలంలో 14 మంది తెలుగు ప్లేయర్లు పోటీ పడితే ఒక్కరినీ తీసుకోలేదు. భగత్ వర్మ హరిశంకర్ రెడ్డిని CSK, యుధ్ వీర్ సింగు MI, భరత్ ను …
Read More »పోరాడి ఓడిన హైదరాబాద్
ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ… ఐపీఎల్–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్ ‘సూపర్’దాగా సాగితే… మూడో మ్యాచ్ ‘బౌల్డ్’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు …
Read More »