పోలీసులపై హల్‌చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై దుర్భాషలు మాట్లాడటంతో భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇటీవల భోలక్‌పూర్‌లో జరిగిన ఘటనే కార్పొరేటర్ అరెస్ట్‌కు దారితీసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్ ప్రాంతంలో షాపులు బంద్ చేయాలని పోలీసులు అక్కడికి దుకాణదారులకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అక్కడి షాపు ఓనర్స్ …
Read More »జూబ్లీహిల్స్ బ్యాంక్ లాకర్‌లో 18 గంటలు..
జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ లాకర్ రూమ్‌లో ఓ వృద్ధుడు ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయాడు. రోడ్డు నంబర్ 67లో నివసించే 84 ఏండ్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4.30 సమయంలో యూనియన్ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్‌కు సంబంధించిన పని ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. అయితే లాకర్ రూమ్‌లో కృష్ణారెడ్డి ఉండగానే అక్కడి సిబ్బంది గమనించకుండా లాక్ చేసి వెళ్లిపోయారు. దీంతో కృష్ణారెడ్డి నైట్ అంతా …
Read More »సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More »పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధించకుండా కాపాడేందుకు అదేవిధంగా రవాణా చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు ఎమ్మెల్యే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గోరక్షకులు, తన మద్దతుదారులతో ఎమ్మెల్యే రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్ అసౌకర్యానికి కారణమయ్యారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు అదనపు సిబ్బందితో కలిసివెళ్లి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read More »పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగరంలోని యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ క్రమంలో కూకట్ పల్లిలో తమ విధులను నిర్వహిస్తున్న పోలీసులకు ఆకలితో ఆలమటిస్తున్న యాచకులు ముగ్గురు కన్పించారు. దీంతో ఆ ముగ్గురికి పోలీసులు ఆహారాన్ని సమకూర్చారు.ఈ …
Read More »అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …
Read More »