టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి …
Read More »ఎన్టీఆర్ కుమార్తె పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముందో తెలుసా?
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక జూబ్లీహిల్స్ పోలీసులకు చేరింది. ఉస్మానియా ఫొరెన్సిక్ డాక్టర్లు ఆ నివేదికను పోలీసులకు అందజేశారు. ఉమామహేశ్వరి సూసైడ్‌చేసుకునే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. మెడ భాగంలో స్వరపేటిక బ్రేక్ అవ్వడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలో ఉంది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు..తాజాగా అందిన ఫొరెన్సిక్ నివేదిక ప్రకారం …
Read More »మరోసారి ఇలాంటివి జరగొద్దు.. పంజాగుట్ట పీఎస్‌కు ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత శేఖర్‌రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో కోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ఆదేశాలతో ‘లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ’ సినిమాను నిలుపుదల చేశారని చెప్పారు. నిర్మాత శేఖర్‌రాజుకు తాను ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్మ కోరారు. ఆయనే తనకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు …
Read More »హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్‌కు ఎన్.శంకర్, ఆసిఫ్‌నగర్‌కు శ్రీనివాస్, రాంగోపాల్‌పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు …
Read More »హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు
ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, కానిస్టేబుల్ సందీప్, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More »వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్ ఘటనపై కేటీఆర్ ట్వీట్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో మైనర్లను మేజర్లుగానే పరిగణించి శిక్షించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. మైనర్‌గా ఉన్న వ్యక్తులు మేజర్‌లా క్రూరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి పాల్పడితే వాళ్లను కూడా మేజర్‌గానే పరిగణించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Read More »జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌పై కీలక అప్‌డేట్
జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.
Read More »ఆ ఫొటోలుఎమ్మెల్యే రఘునందన్‌కి ఎలా చేరాయబ్బా?
పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్‌పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తన ప్రెస్‌మీట్‌లో చూపించిన ఫొటోలు, వీడియోలపైనా పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ ఘటనపై జూబ్లీహిల్స్‌లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రఘునందన్ చూపించిన ఫొటోలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నిందితుల ఫొటోలు, వీడియోలు …
Read More »హైదరాబాద్.. కారులో గ్యాంగ్ రేప్: మరో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ …
Read More »రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్!
హనుమాన్ జయంతి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్ శోభాయాత్ర జరనున్నందున సిటీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయని తెలిపారు. 16వ తేదీ (రేపు) ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ (ఎల్లుండి) ఉదయం 6 గంటల వరకు వైన్‌షాప్‌లు బంద్ అవుతాయని తెలిపారు. మరోవైపు హనుమాన్ శోభాయాత్రకి 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడలోని రామాలయం నుంచి తాడ్‌బండ్‌లోని హనుమాన్ …
Read More »