ప్రేమించడం లేదనే కోపంతో వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సనత్‌నగర్‌కు చెందిన స్రవంతికి 2013లో యాదగిరి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందు నుంచే రవి అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. …
Read More »గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్..కేసీఆర్ ఆదేశం..!
భారతదేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . చార్మినార్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలి, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలని, సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతం సబర్మతి నది ఫ్రంట్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. …
Read More »హైదరాబాద్ హోటల్‌లో పేకాట.. వ్యభిచారంలో ..టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు…
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్‌లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.23 లక్షల నగదు, …
Read More »ట్యాంకు బండ్ వద్ద హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి…40మంది అరెస్ట్
హైదరాబాద్ నగరంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఓ హోటల్‌పై ఈ రోజు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు జరిపి 40మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, విదేశీ మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. సంపున్న మహిళలు కూడ ఉన్నారు. వీరి దగ్గరి నుండి కోట్ల రూపాయలు పట్టుబడినట్లు సమచారం . మూడు …
Read More »హైదరాబాద్ ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం
భాగ్యనగరంలోని కోఠి ప్రధాని కూడలిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో మూడు కంప్యూటర్లు, పలు దస్తావేజులు మంటలకు ఆహూతయ్యాయి. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
Read More »హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి.. ఈ కారణంతో కూడ చనిపోతారా
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో శ్రీచైతన్య కళాశాల ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తోట సంయుక్త(17) బుధవారం అర్థరాత్రి కాలేజ్ హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంయుక్త స్వస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రణంపల్లె గ్రామం. సంయుక్త తండ్రి రాజేందర్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నీట్ మెడికల్ లాంగ్ టర్మ్ …
Read More »సినీనటుడు మనోజ్ కారు నుజ్జు…నుజ్జు
నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలతో పాటు, వాహానదారులు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారు. ఈ వర్షాలకు సినీనటుడు మనోజ్ నందన్ కారు ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే… గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. వర్షాలకు నానిపోయిన గోడ ఒక్కసారిగా కూలిపోగా ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఓ …
Read More »తెలుగు యాంకర్ మృతి
ప్రముఖ యాంకర్ మల్లిక అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వివాహానంతరం నటనకు దూరమయ్యారు. నేడు ఆమె …
Read More »కూకట్‌పల్లిలో కుంగిపోయిన రోడ్డు..
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ఎల్లమ్మబండ మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి కమాన్ వద్ద నుంచి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్‌లైన్ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికివస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Read More »మహిళా కానిస్టేబుల్ ఉద్యోగం….కాని ఈ ఒక్క కారణంతో ఆత్మహత్య
హైదరాబాద్‌లోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ బలవన్మరణం చెందింది. నల్గొండకు చెందిన నవీన, వేములపల్లికి చెందిన మరో ట్రెయినీ కానిస్టేబుల్ మాధవి మంచి స్నేహితులు. అయితే తనకు ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని కలతచెందిన మాధవి శనివారం తన స్వగ్రామంలో ఆత్మహత్యకు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన పోలీస్ …
Read More »