ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ …
Read More »జేడీఎస్ ఒంటరి పోరు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్(సెక్యులర్) ఒంటరిగా పోటీ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూటమి ఉండదని ఆయన స్పష్టం చేశారు. బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని, అయిదు లేదా ఆరు లేదా ఒక్క సీటు గెలిచినా పర్వాలేదని దేవగౌడ తెలిపారు. బలంగా ఉన్న చోటే తమ అభ్యర్థుల్ని …
Read More »మణిపూర్ నగ్న వీడియోపై సీఎం సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా అలజడి రేపిన మహిళల నగ్నంగా ఊరెగింపు వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదయింది. వీడియో కూడా దొరికింది. కానీ పార్లమెంట్ సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు. ఇందులో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్లో బీజేపీ సర్కారు ఉండటం వల్లే …
Read More »మణిపూర్ లో మరోదారుణం
మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన జరిగిన అదే రోజు మరో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్ పీక్సీ ప్రాంతంలో కార్ సర్వీస్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించినట్లు.. అక్కడ యువతులు చనిపోయినట్లు, వారి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది.
Read More »దేశంలో అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు వీళ్లే..?
ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి. వారిలో ముగ్గురికి రూ.1000 …
Read More »ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మహిళా రెజ్లర్లు
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెజ్లర్లు శనివారం అర్థరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసినట్లు సాక్షీమాలిక్ భర్త సత్యవ్రత్ ఖదియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి సరైన రీతిలో స్పందన రాలేదని సత్యవ్రత్ తెలిపారు. శనివారం రాత్రి 11 …
Read More »మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరబ్బర్ సింగ్ ఆరోపణలు చేశారు.. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. కాగా ‘అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు’ కేసులో.. లంచం తీసుకోవాలని తనపై హోం మంత్రి ఒత్తిడి చేశారని …
Read More »1978లోనే చరిత్ర సృష్టించిన నాయిని
నాయిని నర్సింహారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాయిని.. టంగుటూరి అంజయ్యను ఓడించారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయిని.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 1975లో ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్టు పార్టీ నాయకులందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. నాయినితో పాటు పలువురిని 18 నెలల పాటు చంచల్‌గూడ జైల్లో పెట్టారు. ఆ …
Read More »జొన్న రొట్టే, కోడి మాంసం అంటే నాయినికి మస్త్ ఇష్టం
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి జొన్నరొట్టే, కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఈ రెండింటి కాంబినేషన్ చిన్నప్పటి నుంచే ఆయనకు అలవాటు. అది ఇప్పటి వరకూ కొనసాగింది. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో జొన్నరొట్టె, కోడి మాంసం వండాల్సిందే. ఈ వంటకాన్ని నాయిని అతి ఇష్టంగా తినేవారు. బేగంబజార్ జిలేబీ అంటే మహా ఇష్టం. ఇక పాతబస్తీలోని బేగంబజార్‌కు నాయినికి ఎంతో అనుబంధం ఉంది. సోషలిస్టు ఉద్యమాలు చేసిన సమయంలో …
Read More »