తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు మారాయి. ఇందులో భాగంగా నగరంలోని జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్), మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య కారిడార్-II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ప్రధానంగా ఆఫీసు వేళల్లో మెట్రోల్లో …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది. దీనికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. మెట్రో దిగిన తర్వాత …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …
Read More »రేపటి నుండి మెట్రో పరుగులే పరుగు
తెలంగాణలో లాక్‌డౌన్ గడువును పెంచుతూ ప్రభుత్వం మంగళవారం తీసుకున్న నిర్ణయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఈ మేరకు ఈనెల 10 నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు 5.30 గంటలకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన వేళలను బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
Read More »మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం
హైదరాబాద్ మహానగరంలో ప్రయాణమంటేనే నరకం. రోడ్డెక్కితే చాలు..ఇంటికి ఎప్పుడు చేరుతామన్న గ్యారంటీ లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్‌లు. సిగ్నళ్లు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేం. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడుతూ ప్రయాణిస్తూ చాలామంది అలసటకు లోనవుతున్నారు. ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరరోడ్లపై నిత్యం నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాదీలు మెట్రో రాకతో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. చింతలను దూరం చేసి..వింతలను పరిచయం చేస్తున్న మెట్రోలో మియాపూర్-ఎల్బీనగర్ వరకు ప్రయాణిస్తూ కొందరిని పలకరించగా కొత్త …
Read More »నేటి నుండి రాత్రి 9.30వరకు మెట్రో రైళ్లు
ప‌్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకల సమయాన్ని అధికారులు పొడిగించారు. దీంతో నేటి నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటివరకు విరామాలతో రాత్రి తొమ్మిది గంటల వరకు రైళ్లను నడిపారు. అయితే రద్దీ పెరగడంతో రైళ్ల సమయాలను మరో అరగంట పాటు పొడిగించారు. ప్రతి మూడు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్చి …
Read More »గ్రేటర్లో మూడు కారిడార్లలో మెట్రో రాకపోకలు
తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. హెచ్‌ఎంఆర్ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతి స్టేషన్‌లో అధికారులు కొవిడ్ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ప్రయాణికులను అనుమతించారు. అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్ భయం..వర్క్ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత …
Read More »ఈ నెల 7 నుంచి మెట్రో..
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్ లాక్–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల …
Read More »హైదరాబాద్ మెట్రోకి 3జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …
Read More »హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రోరైలు ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేసింది. మొన్న సోమవారం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాధారణ రోజులను పరిగణనలోకి తీసుకొంటే ఇదే అతిపెద్ద రికార్డని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2019 డిసెంబర్ 31 ఉదయం నుంచి 2020 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు …
Read More »