హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అక్టోబర్ 13, సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బురాన్‌పురం నుంచి గాయత్రి రవి ఇంటివరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. …
Read More »ధర్మపురి లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని స్వామివారు దర్శించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, నదీమతల్లికి హారతినిచ్చారు. తదనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశా రు. స్వామివారి ఆగమనం సందర్భంగా …
Read More »1000 కి.మీ. పూర్తి చేసుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …
Read More »కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి…!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు అక్టోబర్ 10, గురువారం నాడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండగట్టుకు విచ్చేసిన స్వామివారికి ఆలయ ఫౌండర్, ట్రస్టీ మారుతి,ఈవో కృష్ణ ప్రసాద్, ప్రధాన అర్చకులు పూలమాలలు సమర్పించి, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని ఆంజనేయస్వామికి స్వామివారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ …
Read More »వేములవాడ రాజన్నను దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. గత 10 రోజులుగా స్వామివారు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో దేవీ నవరాత్రులలో శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజాది కార్యక్రమాలతో పాటు, జిల్లాలోని పలు చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను …
Read More »వరంగల్‌లో భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారుహిందూ ధర్మ ప్రచార యాత్ర నిమిత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత వారం రోజులుగా హన్మకొండలోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామలదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తదనంతరం జిల్లాలోని పలు చారిత్రక దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ స్వామి వారు హిందూ ధర్మ ప్రచారం …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి హరీష్‌రావు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు స్వామివారు వరంగల్‌లోనే పర్యటిస్తారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారిని నిత్య పీఠపూజలు చేసిన …
Read More »ధర్మారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి…!
హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ, చండీ నామం, దుర్గాసప్తశతిపూజ, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజలు చేస్తూ, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. తదనతరం ప్రతినిత్యం …
Read More »వరంగల్ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి సందేశం..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడవరోజు రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి పూలతో, ఆభరణాలతో అందంగా అలంకరణలు చేసి వివిధ పూజాది …
Read More »వరంగల్‌లోశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకున్న ప్రముఖులు…!
హన్మకొండలోని, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొన్నారు. ఏడవరోజైన శనివారం నాడు స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల దేవిపీఠపూజ, చండీపారాయణం, చండీ హోమం, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజాదికార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ ఇంట్లో స్వామివారిని పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీమంత్రి బసవరాజు …
Read More »