హైదరాబాద్‌లో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »హెచ్ఐసీసీలో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైపర్మామెన్స్ కంప్యూటింగ్ ,డేటా అనలిటిక్స్ సదస్సు ఈ రోజు మంగళవారం నుండి హెచ్ఐసీసీలో జరగనున్నది. ఈ సదస్సుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు,పారిశ్రామిక వేత్తలు,పరిశోధకులు హాజరు కానున్నారు. ఈ కామర్స్ ,రిటైల్ ,హెల్త్ కేర్,ఇంజినీరింగ్ ,వ్యవసాయం ,వాతావరణం లాంటి పలు అంశాలపై అధ్యయనాలు,అత్యుత్తమ ప్రమాణాల గురించి సదస్సు జరగనున్నది.
Read More »జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రోరైల్ ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలను అందిస్తున్న మెట్రో ఇప్పుడు చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మధ్య ప్రతి 4 నిమిషాలకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచిచూడాల్సిన అగత్యం తప్పింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్విన్ సింగిల్‌లైన్ మెథడ్ కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండేది. మంగళవారం నుంచి …
Read More »