ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప‍్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ గురువారం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్ అయింది. కాగా హెలికాప్టర్ ఒడిశాలోని గోపాల్‌పూర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »2018 అక్టోబర్ చివరి నాటికి అది చేసి చూపిస్తాం.. మంత్రి తుమ్మల
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త జిల్లాల భవనాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమాధానం ఇచ్చారు. పది జిల్లాలు ఉన్నటువంటి రాష్ర్టాన్ని 31 జిల్లాలుగా మార్చామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు పాలన వెళ్లిందన్నారు. ఈ కొత్త సంస్కరణలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అంతేకాకుండా అధికారులను ప్రజలు నేరుగా కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. 26 జిల్లాల్లో కొత్త భవనాలకు …
Read More »