తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »రావత్ భౌతికకాయానికి గవర్నర్ తమిళసై నివాళి
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ నీలగిరి జిల్లాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో వీరసైనికుల భౌతికకాయాలకు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవదేహాల ముందు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. …
Read More »కర్నూలు జిల్లాలో వర్షాల సమయంలోనూ సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై శ్రద్ధలేదా.. జరగరానిది జరిగితే బాధ్యులెవరు.?
తాజాగా నిన్న సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన హెలికాఫ్టర్ ఘటనలు ఆపార్టీ శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయని అధికారలు సమాచారం అందించారు. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో …
Read More »