రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, …
Read More »హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్‌జామ్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా రోడ్లపైకి వరదనీరు రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ మొదలైన చోట్ల వర్షం పడింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు …
Read More »తెలంగాణకు అతి భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటన విడుదల చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. వర్షాలతో పాటు గంటకు సుమారు 40కి.మీ వేగంతో …
Read More »భారీ వర్షాలు.. అలెర్ట్‌గా ఉండండి: కేసీఆర్ ఆదేశం
మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది …
Read More »ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …
Read More »నెలరోజులకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచండి: కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …
Read More »అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం.. పదిమంది మృతి
జమ్ముకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది యాత్రికులు మృతి చెందగా, పలువురు గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగతావారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా కుంభవృష్టి వర్షం కురవడంతో మృతుల …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్ మీటింగ్
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …
Read More »గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు
గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, …
Read More »కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
ఏపీలోని కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది.
Read More »