హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం అతిభారీ, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆ నీరు …
Read More »మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగానూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గుజరాత్‌లో అతిభారీ వర్షాలు కురిసే …
Read More »హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండు రోజులూ ఇంతే!
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఇటు పటాన్ చెరు నుంచి అటు అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వర్షం కురుస్తూనే ఉంది. అమీర్‌పేట్, నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో …
Read More »అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సెక్రటేరియట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.
Read More »ప్రజలు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు కురుస్తున్నందున మహారాష్ట్రతో పాటు తెలంగాణకు రెడ్‌అలర్ట్ ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్‌ను అలర్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల …
Read More »హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!
భాగ్యనగర వాసులకు ఊరట కలిగించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఇది కాస్త ఉపశమనం. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీకి నార్త్, వెస్ట్రన్ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయని.. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ …
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం..రంగంలోకి టాస్క్ ఫోర్స్ టీమ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది.అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. భారీ వర్షాలతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో GHMC హై అలర్ట్ ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దించింది. వాటర్ లాగింగ్స్ లేకుండా చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేసింది.గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ లో కంట్రోల్ …
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల శుక్రవారం (ఏప్రిల్-6) రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు పడింది.ఈ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.అయితే వెంటనే స్పందించిన GHMC సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.నగరంలోని ఖైరతాబాద్, …
Read More »సికింద్రాబాద్‌లో వడగండ్ల వాన
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల ఆకస్మికంగా వర్షం కురిసింది . నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వర్షం పడగా.. సికింద్రాబాద్, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్‌గిరి, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Read More »