నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ క్యాలరీలను బర్న్ చేస్తూ.. కొవ్వును నిల్వ ఉండకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా లెమన్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే నిల్వ చేసిన నిమ్మరసం తాగకూడదు.
Read More »ఆలస్యంగా నిద్రపోతే..?
సాధారణంగా ఆలస్యంగా నిద్రపోతే, లేట్ గా మేల్కొంటారు. దీంతో నిద్రను ప్రభావితం చేసే విటమిన్-డి శరీరానికి తగినంత అందదు. విటమిన్-D లోపం డిప్రెషన్కు దారితీస్తుంది. ఇది నిద్ర నాణ్యతపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పగటిపూట నిద్రపోవాలనిపించడం డిప్రెషన్ సంకేతాలలో ఒకటి. ఆందోళన, డిప్రెషన్ నిద్రను తగ్గిస్తాయి. వీటికి తోడు.. మైగ్రేన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. సో.. స్లీప్ సైకిల్ని సరిగ్గా మేంటేయిన్ చేయండి.
Read More »కివీ పండ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
ఇరాన్ నుంచి కివీ పండ్ల దిగుమతిని కేంద్రం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశంలోకి వచ్చిన 22 సరుకుల్లో తెగులు ఉన్న పండ్లను గుర్తించినట్లు చెప్పారు. దీంతో కివీ పండ్లను పంపొద్దని ఇరాన్కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అయినా ఆ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధం విధించినట్లు తెలిపారు.
Read More »మీకు ఐరన్ లోపమా..?
శరీరంలో ఐరన్ లోపముంటే రక్తహీనత వస్తుంది. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు కింది పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. బచ్చలి కూర, పాలకూర 2. అలసందలు 3. బెల్లం 4. ఉసిరికాయ 5. నానబెట్టిన ఎండుద్రాక్ష
Read More »Break Fast లో మీరు ఏమి తింటున్నారు..?
Break Fast లో తీసుకున్న ఆహారమే మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉత్సాహాంగా ఉంచుతుంది. అందులో పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 1. ఖాళీ కడుపుతో బాదం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. 2. అల్పాహారం సమయంలో అరటిపండ్లు, పాలు తీసుకుంటే మంచిది. 3. పొద్దుతిరుగుడు, నువ్వులు, చియా, గుమ్మడికాయ గింజలు తినాలి. 4. ఉదయాన్నే ఒక కోడిగుడ్డు తింటే ఎముకలకు, రక్తానికి, చర్మానికి మంచిది. …
Read More »సూసైడ్ మెషీన్ వచ్చేసిందిగా..?
కోరుకున్న సమయానికి.. ఎలాంటి బాధలేకుండా రెప్పపాటులో చావు వస్తే.. అంతకంటే అదృష్టం ఉంటుందా?’ తరుచూ ఈ మాటలు వినే ఉంటాం. నొప్పితెలియని, అనాయాస చావును ప్రసాదించాలని కోరుకునే వారూ కోకొల్లలు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. నొప్పిలేని మరణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘సూసైడ్ మెషీన్’కు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఏమిటీ …
Read More »బరువు తగ్గాలంటే..?
శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. * గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు. * బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. * మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. * ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి. * శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ …
Read More »ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసా..?
ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండు ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది దంతాలను కూడా బలంగా మార్చడంలో సాయపడుతుంది. పాలకూరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను పటిష్టంగా చేస్తుంది. విటమిన్ A వాటికి శక్తినిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలకు ఎదురుండదు.
Read More »టమాటోలు ఇస్తే బిర్యానీ Free.. ఎందుకంటే..?
చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను …
Read More »ఖాళీ కడుపుతో ఏమి తినాలి.. ఏమి తినోద్దు..?
కొన్ని ఆహారాలు ఖాళీ కడుపుతో తినడం మంచిదే అయినా.. మరికొన్ని నష్టం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ద్రాక్ష, నిమ్మకాయ, నారింజ, బేరి వంటి పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్స్, ఫ్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అలాగే చిలగడదుంప, మసాలా ఫుడ్ ఉదయం తీసుకోకపోవడమే ఉత్తమం.
Read More »