వాముతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. వాముని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు టీస్పూన్ పొడి వేసుకుని తినాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే వామును నిప్పులపై వేసి పొగ పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
Read More »గ్రీన్ టీ తాగుతున్నారా మీరు..?
బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. అయితే ఎన్నిసార్లు తాగుతున్నారనేదే పాయింట్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్తో పాటు కెఫిన్ కూడా ఉంటుంది. అందుకే రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని పోషక విలువలు ద్రవాల రూపంలో బయటికి వెళ్తాయి. భోజన సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల అధిక …
Read More »కాకరకాయ తినడం చాలా మంచిది
సాధారణంగానే కాకరకాయ తినడం చాలా మంచిది. అయితే వర్షాకాలంలో తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీన్ని కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తాగినా పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.
Read More »బాదం ఎందుకు నానపెట్టాలంటే..?
ఉదయాన్నే లేచిన తర్వాత నాలుగు బాదం పప్పులు, నాలుగు వాల్‌నట్స్ తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు చెబుతుంటారు. ఇవి ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయాన్నే ఈ నట్స్ తినటం వల్ల హార్మోన్ల సమతౌల్యం బావుంటుంది. మొత్తం రోజంతా అలసిపోకుండా ఉంటారు. వీటిని 8 నుంచి 10 గంటలు నానపెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు బయటకు పోవు. బాదంలో ప్రొటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం …
Read More »పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు ఉంటుందా..?
ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక రక్తపోటు బారినపడుతున్నారని వీరు సకాలంలో వ్యాధిని గుర్తించలేకపోవడంతో గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవన శైలి వ్యాధి అయిన బీపీని సులభంగా గుర్తించే వెసులుబాటుతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన మందులతో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది తమకు బీపీ ఉందనే విషయం తెలియడం లేదని దీంతో తీవ్ర అనారోగ్యాలు …
Read More »బీటు రూటు తో లాభాలు ఎన్నో..?
బీటు రూటు తో బోలెడన్ని లాభాలు రక్తహీనతను నివారిస్తుంది తక్షణ శక్తి లభిస్తుంది కొవ్వు కరుగుతుంది రోజంతా చురుగ్గా ఉంచుతుంది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది ఎముకలను దృఢంగా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
Read More »క్యారెట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
క్యారెట్ తో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంటిచూపు మెరుగవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. జుట్టు పొడిబారదు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.
Read More »చెరుకు రసంతో లావు తగ్గుతారా..?
ప్రస్తుత రోజుల్లో పొట్ట తగ్గడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యలుగా మారాయి. ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం బరువు తగ్గించగలదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలదు. అంతేకాదు, ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. సో.. రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగేయండి. హెల్తీగా ఉండండి.
Read More »ప్రతిరోజూ 3 లవంగాలను తింటే
ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
Read More »గ్రీన్ టీ తాగితే…?
గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
Read More »