తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు. అందువల్ల ప్రజాప్రతినిథులు తమ పరిధిలో ఉన్న ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. నగరంలోని కొండాపూర్ ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అదనపు పడకల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హారీష్ రావు Fire
తెలంగాణలో రైతన్నలు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, కిషన్రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Read More »బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్,స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ హెల్త్ మిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ కనీస అర్హత ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నవాళ్లు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. …
Read More »