కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బయట ఉన్న రెండు కోనేర్లతో సహా ఆ ప్రాంతమంతా మునిగిపోయి లోపలి కోనేటిలోకి వరదనీరు చేరింది. దీంతో రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర నీరు చేరింది. ఇది మహానంది క్షేత్ర చరిత్రలోనే ప్రప్రథమం అని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులెవ్వరూ స్వామి వారి …
Read More »గుంటూరునుంచి సచివాలయానికి తెగిపోయిన రాకపోకలు.. భయాందోళనలో రాజధాని ప్రజలు
ఏపీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన కాల్వలు పొంగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం చందాపురం నల్లవాగు బ్రిడ్జి మీదకు వర్షపునీరు చేరింది. దీంతో నందిగామ, చందర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంచికచర్ల మండలం కీసర దగ్గర మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. …
Read More »