తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More »జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ర్టంలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. సెక్రటరీల పట్ల మరోసారి సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ జీతాలు ఇస్తామన్నారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కడుపులు నింపినోళ్లం.. కడుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా చేయడం వల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హరితహారంలో నాటిన …
Read More »గోదావరి జలాలు.. విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …
Read More »సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా గోదావరి జలాలు కూడవెళ్లి వాగులోకి వస్తాయని ఎవరూ భావించలేదని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేసి హరీశ్.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. ‘‘కూడవెళ్లి వాగుకు ఇవాళ 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. గతంలో గుక్కెడు నీటి కోసం ఘోష పడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పుష్కలంగా తాగునీటితో పాటు సాగునీరు సరఫరా అవుతోంది. …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ జరగనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22- రైతుల రుణాలు మాఫీకి 5,225 కోట్లు
గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రుణాలను మాఫీ చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే ఈ రుణాలను మాఫీ …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22- మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు
తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు తాజా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్‌లు, 3 ఆర్‌వోబీలను పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌లో రూ. 2 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవర్లు, 300 …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22-GHMCలో ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 20 వేల లీటర్ల సురక్షిత మంచినీటికి ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గిందన్నారు. నగర ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22-వ్యవసాయ రంగానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం అని పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా.. నేడు …
Read More »తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ హైలెట్స్
తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ కాపీని మంత్రి చదివి వినిపిస్తున్నారు. -రాష్ర్ట బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు -రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు -ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు -పెట్టుబడి వ్యయం రూ. 29.046.77 కోట్లు -వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ -ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 …
Read More »