బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతుల …
Read More »ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …
Read More »అర్హులైన ప్రతి కుటుంబానికి దళితబంధు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కొత్తగా వివాహం అయినవారికి కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. అకౌంట్లలో పడిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులతోపాటు 65 ఏళ్లలోపు ఉన్న …
Read More »చేనేత కార్మికులకు శుభవార్త.. రూ. 30 కోట్లు మంజూరు
చేనేత కార్మికులకు మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం త్వరలోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామని హరీశ్రావు పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం రూ. 70 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో చేనేత కార్మికులకు నూలు, విక్రయాలకు సంబంధించిన రిబెట్ …
Read More »ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయాం -మంత్రి Harish Rao
సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట అర్భన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు , ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ దేవునూరి తిరుపతి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మందపల్లి లో తిరుపతి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక మంచి …
Read More »తెలంగాణ వ్యాప్తంగా దళితబంధును అమలు చేసి తీరుతాం
దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు ఇంటింటి సర్వేపై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర …
Read More »సిద్దిపేటలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్‌లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను మంత్రి హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ …
Read More »ఉప ఎన్నికలో గెలుపు “గులాబీ”దే
హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం తథ్యమని, 50 వేల మెజార్టీతో గెలుపును సి ఎం కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ రూరల్, టౌన్ కు సంబంధించిన ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తల సమావేశం సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావు మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్, బీజేపీ …
Read More »ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని, తాము ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి లబ్దిదారులకు రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, …
Read More »గ్రామాల అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదే
గ్రామాల అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదేనని, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ అధికారులతో కలిసి సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్‌లకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో గురువారం సిద్దిపేట రూరల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను …
Read More »