హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ …
Read More »అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్‌రావు…!
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి వ్యాఖ్యానించారు. …
Read More »సీఏఏపై శాసనసభలో చర్చిద్దాం-సీఎం కేసీఆర్
కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో …
Read More »రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు …
Read More »లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా దిశను మార్చుకొని ఎదురెక్కుతూ వందల కిలోమీటర్లమేర పాలకడలిలా గోదావరి నది విస్తరిస్తున్నది. ఇక్కడి లింక్ -1,2లో మోటర్లు దిగ్విజయంగా నడుస్తుండగా, గోదావరి అజేయంగా రైతన్న బీళ్లకు పరుగులు తీస్తున్నది. దిగువన భూపాలపల్లి జిల్లాలో లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు కొనసాగుతుంది. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనూ పంపులు నిర్విరామంగా నడుస్తున్నాయి. మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో మంగళవారం …
Read More »మంత్రి హారీష్ రావు ఆదేశాలతో కదిలిన అధికారులు
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో,మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొంటున్నారు. పట్టణాల్లోని మురుగు కాలువలను పరిశుభ్రం చేయడమే కాకుండా పిచ్చి మొక్కలను తొలగించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న మంత్రి సంగారెడ్డి …
Read More »రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను జడ్పి చైర్మన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు. ** అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న …
Read More »సీఎం కేసీఆర్ కాళేశ్వరం టూర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీబరాజ్‌ను సందర్శించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ వివరాలు.. * ఇవాళ ఉదయం 8.50 గంటలకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.05 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు. * 9.30 …
Read More »జీవధారగా కాళేశ్వరం
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం .ఈ ప్రాజెక్టు ఇటు తాగునీరు, అటు సాగునీటికి అవసరం ఉన్నప్పుడల్లా జలాలను అందిస్తూ జీవధారగా మారుతున్నది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిన వెంటనే గోదావరి జలాలతో తిరిగి నింపేందుకు అద్భుతంగా ఉపయోగపడుతున్నది. నీటి ఏడాది చివరి దశకు చేరుకుంటున్న సమయంలోనూ ఎలాంటి ఢోకాలేకుండా జలధారలను అందిస్తున్నది. ఎస్సారెస్పీతో సంబంధం …
Read More »సీఎం కేసీఆర్ రెండో సోదరి భర్త కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read More »