తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతుందని పాడిన పాటను, కేసీఆర్ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేస్తూ పట్టణ ప్రజలకు అందిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువుపై గ్లోగార్డెన్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్‌రాజుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »పారే నీళ్లను చూడలేని కళ్లు!
‘ఇది కాళేశ్వరం కాదు, తెలంగాణకు పట్టిన శనేశ్వరం.. వరదలు వస్తే మోటర్లు బంజేసుకునే ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది అంటే, అది మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే.. రీ డిజైన్‌లో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో మోటర్లను 800 అడుగుల నుంచి 821 అడుగుల వద్ద వరదకు అందనంత ఎత్తులో పెట్టారు..’ ఇవీ.. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన మెసేజ్‌లు. మిడిమిడి జ్ఞానంతో, కాళేశ్వరం …
Read More »శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు హరీష్, గంగుల కమలాకర్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్, సుంకే రవిశంకర్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ …
Read More »తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో …
Read More »సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్
సిద్దిపేట జిల్లాకు రాష్ర్ట ప్రభుత్వం ఐటీ టవర్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ. 45 కోట్లతో కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద ఈ ఐటీ టవర్‌ను నిర్మించనున్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, టూరిజం హోటల్ మధ్యలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మంత్రి హరీష్ రావు హర్షం సిద్దిపేట …
Read More »సిద్ధాంతం లేని రాద్ధాంతపు పార్టీ బీజేపీ
బీజేపీకి ఒకప్పుడు సిద్దాంతం ఉండేది. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారింది. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. వారి వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి. కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు వేయాలి. 70 ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెరుకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదు. …
Read More »అధునాతన హంగులతో.. పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య..
సిద్ధిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాలకు ₹14 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలలను మంజూరు చేసుకున్నామని చెప్పారు.16 పాఠశాలలకు స్వంత భవనాలు ఉన్నాయ్.. 6 పాఠశాలలకు స్వంత భవనాలు లేక విద్యార్థులకు …
Read More »దుబ్బాక ఉప ఎన్నికలు- అదే టీఆర్ఎస్ కొంపముంచింది..!
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు కారును పోలిన గుర్తును కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 3,489 ఓట్లు పడ్డాయి. దీంతో కొంతమంది దుబ్బాక ఓటర్లు పొరపాటుగా అతనికి ఓటు వేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్ రావు
దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు ప్రజా తీర్పును శిరసావహిస్తామని..టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల్లోనే ఉంటామన్న హరీశ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Read More »ఫలితాలపై సమీక్షించుకుంటాం:మంత్రి కేటీఆర్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.
Read More »