ఓ వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేశాడు. అంతే కాకండా ఆ రెండు చోట్లా రిటైర్ అయ్యాడు కూడా. కనీసం పక్కనున్న వ్యక్తికి తెలీకుండా, ఎవరకీ అనుమానం రాకుండా ఇన్నేళ్లు పని చేసిన వ్యక్తి తాజాగా పెన్షన్ కోసం వెళ్లి దొరికిపోయాడు. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్ రెండు వేరువేరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని.. ఒకదాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరొకటి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో …
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా?: కేటీఆర్ ఎద్దేవా
సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ సభలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదివారని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. పొత్తు కావాలని ఆ పార్టీని ఎవరైనా …
Read More »పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: రాహుల్
ఎంతోమంది యువత, తల్లుల రక్తం, ఆయా కుటుంబాల కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ మాట్లాడారు. ఏ కలలు నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని.. అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో …
Read More »పెళ్లి అయిన నెలరోజులకే బ్లేడ్‌తో భర్త గొంతు కోసేసింది!
హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబకలహాల నేపథ్యంలో భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. ఈ ఘటన దామెర మండలం పస్రగొండలో చోటుచేసుకుంది. భర్తకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పస్రగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు, అర్చనకు మార్చి 25నే పెళ్లి అయింది. నెలరోజులు పూర్తికాకుండా భర్తపై భార్య ఈ దారుణానికి పాల్పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు …
Read More »