మన వెంట్రుకలకు సహాజంగానే వానకాలం శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే. వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి …
Read More »మీకు జుట్టు ఊడిపోతుందా..?
మీ జుట్టు ఊడిపోతుందా.. ఏమి చేసిన కానీ ఊడే జుట్టును కాపాడుకోలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని టిప్స్. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం . జుట్టుకు నూనె, షాంపూ రాసేటప్పుడు గోర్లతో గట్టిగా గీకకూడదు. వారంలో 2 రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. వేడినీళ్లకు బదులు చల్లని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఆహారంలో విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఉండేలా …
Read More »మీకు జుట్టు రాలుతుందా..?
రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
Read More »మీకు జుట్టు రాలడం సమస్యగా ఉందా..?
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే, జుట్టు సమస్యలకు ఉసిరి చెక్ పెడుతుంది. కురులు తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా ఉండేందుకు పోషణనిస్తుంది. ఇందుకోసం పరగడుపునే ఉసిరికాయలు తినాలి. నాన్-సీజన్లో ఎండబెట్టిన ఉసిరి, మురబ్బా తీసుకోవాలి. ఉసిరి పచ్చడి తిన్నా పోషకాలు అందుతాయి. ఇందులోని విటమిన్-C.. పొటాషియం, సోడియం, ఐరన్ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.
Read More »