అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకారిగా మారిందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాషాయ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకున్నదని, రాష్ట్ర అభివృద్ధిని …
Read More »సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష
అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …
Read More »మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …
Read More »అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్
హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ హసన్ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఛైర్మన్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …
Read More »బీజేపీ సర్కారుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
గులాబీ పార్టీలో నేటి నుంచి సంస్థాగత సంబరం మొదలయ్యిందని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం …
Read More »తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నల్లగొండలో గుత్తా.. నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్ …
Read More »హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్లో పెట్టినవే
హుజురాబాద్ నుంచి ప్రవేశపెట్టనున్న పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివేనని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రితో …
Read More »హరిత స్ఫూర్తిని నింపాలన్నదే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లక్ష్యం
దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో హరిత స్ఫూర్తిని నింపాలన్నదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యమని తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణకు హరితహారం, …
Read More »ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని …
Read More »పీవీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత నివాళి
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, హోంమంత్రి మహముద్ అలీతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. పీవీ …
Read More »