ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ, రంగస్థలాలో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు.
Read More »గుండు హనుమంతరావు గురించి మీకు తెలియని విషయాలు..!
హాస్యనటుడు గుండు హనుమంతరావు 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించారు. హనుమంతరావు తల్లిదండ్రులు కాంతారావు ,సరోజినీ గుండు హనుమంతరావు కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు 1974 లో 18 ఏళ్ల వయస్సులో నాటక రంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో హనుమంతరావు వేసిన మొదటి వేషం రావణ బ్రహ్మ అహన పెళ్ళంట చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి…సుమారు 400 సినిమాల్లో నటించారు . అంతేకాకుండా పలు టీ వీ సీరియల్స్ లో నటించారు. …
Read More »