గుజరాత్‌లో బీజేపీ పార్టీకి చెందిన జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింహ వాఘేలా రాజీనామా చేశారు. ఆ పోస్టుకు రాజీనామా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో అన్నీ సర్ధుకుంటాయన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్లు ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రజినీభాయ్ పటేల్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని, అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ఇటీవల వాఘేలా పేర్కొన్నారు.
Read More »గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వారికి పబ్లిక్ ప్లేస్ కి అనుమతి నిషేధించింది. బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ సర్టిఫికేట్ తనిఖీ చేస్తామని తెలిపింది.
Read More »