తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్ గార్డెన్ లో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అన్ని వర్గాల …
Read More »ఎమ్మెల్యే రేగా కాంతారావుకి సన్మానం
తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం టికెట్ ఖరారు …
Read More »చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ చీఫ్ విప్ నకు శాలువా కప్పి సన్మానించారు. జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వినయ్ భాస్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు …
Read More »సీఎం కేసీఆర్ పై కుట్రతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు
కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్ డై వర్షన్) …
Read More »బీజేపీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతుంది
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. రాకేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలన్నారు. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్ విధానం తీసుకురావడం …
Read More »ఏపీలో అధికార వైసీపీలో పదవుల జాతర
ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన కొఠారు అబ్బయ్య చౌదరి, …
Read More »కొత్త టాకీసులో పాత సినిమాలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ …
Read More »త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …
Read More »యాదాద్రిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
దేశం అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం …
Read More »